తెలంగాణ

telangana

ETV Bharat / city

'కల తీరకుండానే ప్రాణాలు వదిలావా'.. రాకేశ్ తల్లి ఆవేదన.. - కన్నీటి పర్యంతమైన రాకేశ్ తల్లి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్‌ అనే యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

rakesh mother
rakesh mother

By

Published : Jun 18, 2022, 11:45 AM IST

ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లలో వరంగల్‌ జిల్లా యువకుడు రాకేశ్‌ మృతి చెందాడు. రాకేశ్‌ మృతితో... దబ్బీర్‌పేటలో విషాధచాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీర‌య్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ రాకేశ్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సైన్యంలో చేరి దేశానికి సేవ చేద్దామన్న కల తీరకుండానే ప్రాణాలు వదిలావా అంటూ విలపించారు. ఆస్పత్రి మార్చురీ ప్రాంగణం వద్ద రాకేశ్‌ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఎదిగొచ్చిన కొడుకు పోలీసు తూటాకు బలవడంపై కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కన్నీరుమున్నీరు అవుతున్న రాకేశ్ తల్లి

ABOUT THE AUTHOR

...view details