అడవిలో ఉండాల్సిన కొండ చిలువ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో హల్చల్ చేసింది. ఆదివారం రాత్రి ఒక కొండ చిలువ ఫైర్ స్టేషన్ నుంచి ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోకి వెళ్లింది. ఫైర్ సిబ్బంది జూ పార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
హన్మకొండ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో కొండ చిలువ - warangal urban district latest news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో కొండ చిలువ హల్చల్ చేసింది. ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోకి వెళ్లిన కొండ చిలువను జూ పార్క్ సిబ్బంది పట్టుకున్నారు.
హన్మకొండ ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో కొండ చిలువ
సోమవారం ఎంత వెతికినా కొండ చిలువ ఆచూకీ లభించకపోవడం వల్ల మంగళవారం మరోమారు జూ పార్క్ సిబ్బంది గాలింపు ప్రారంభించారు. ప్రెస్ క్లబ్ ముందు ఉన్న ఓ డబ్బా కింద కొండ చిలువను గమనించి.. దానిని చాకచక్యంగా పట్టుకున్నారు.
Last Updated : Aug 25, 2020, 6:55 PM IST