మహిళలు, బాలికలపై నిమిషానికో అత్యాచారం జరుగుతునే ఉందని.. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా రచయితలు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు లేకుండా పోయిందన్నారు.
'మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం' - hanmakonda updates
దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతోందంటూ వరంగల్‌లో మహిళా రచయితలు అవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలను నిరసిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఇటీవల హత్యాచారానికి గురైన బాలికకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
!['మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం' protest by women writers to women safty in india at hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9131231-977-9131231-1602384139554.jpg)
'దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతోంది'
దేశంలో స్త్రీలు.. అందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఎక్కడబడితే అక్కడ అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వాల నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు.