భాజపా పాలనలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్ విమర్శించారు. మహిళలు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని.. బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఉత్తరప్రదేశ్ హాథ్రస్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్షను చేపట్టాయి.
'భాజపా పాలనలో మహిళలు బయటికి రాలేని పరిస్థితి' - hathras incident latest protest at mahabubabad
ఉత్తరప్రదేశ్ హాథ్రస్ ఘటనను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్షను చేపట్టాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కాంగ్రెస్ జిందాబాద్ అని నినాదాలు చేశారు.
హాథ్రస్ ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సత్యాగ్రహ దీక్ష
ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును వేగవంతం చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా అత్యాచార నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలన్నారు. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.