తెలంగాణ

telangana

ETV Bharat / city

తెల్లారితే పరీక్ష.. హాల్​టికెట్ ఇస్తలేరు! - undefined

తెల్లవారితే ఇంటర్ పరీక్షలు.. కానీ.. ఇంతవరకు కళాశాల హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా మా జీవితాలతో ఆడుకుంటుందని విద్యార్థులు రోడ్డెక్కారు.

Private Collage Not Given Hall Ticket To Students
తెల్లారితే పరీక్ష.. హాల్​టికెట్ ఇస్తలేరు!

By

Published : Mar 3, 2020, 11:38 PM IST

తెల్లారితే పరీక్ష.. హాల్​టికెట్ ఇస్తలేరు!

హన్మకొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వృత్తివిద్యా జూనియర్ కళాశాల పేరుతో.. కొందరు ప్రైవేటు వ్యక్తులు కళాశాల నిర్వహిస్తున్నారు. అయితే.. తెల్లవారితే.. పరీక్షలు ఉన్నా.. కొంతమంది విద్యార్థులకు యాజమాన్యం హాల్ టికెట్స్ ఇవ్వలేదు. పరీక్ష ఫీజు వసూలు చేసి.. ఇప్పటి వరకూ హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు.

యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే..ప్రిన్సిపాల్ చేసిన తప్పిదానికి హాల్ టిక్కెట్లు అందలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దాదాపు 22 మంది విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందలేదు.

ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లగా.. విద్యార్థులకు పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. కళాశాలకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లేదని విద్యార్థులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details