పాప ప్రక్షాళన చేస్తూ...ప్రేమ, కరుణ, మానవాళికి పంచిన ప్రభువు....జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటామని క్రైస్తవ సోదరులు చెపుతున్నారు.
విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఓరుగల్లు చర్చిలు - Pre Christamas celebrations at warangal
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా... వరంగల్లో చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఏసు ప్రభువు రాకను స్వాగతిస్తూ... రాత్రి ప్రార్థనలు నిర్వహించేందుకు... క్రైస్తవ సోదరులు సన్నద్ధమౌతున్నారు. ప్రత్యేక గీతాలాపనలతో... క్రీస్తు ఆరాధన చేస్తారు. మార్కెట్లలోనూ పండుగ సందడి నెలకొంది.

విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఓరుగల్లు చర్చిలు
విద్యుద్దీపకాంతులతో మెరుస్తున్న ఓరుగల్లు చర్చిలు
క్రిస్మస్ పండుగ కోలహలం మార్కెట్లలోనూ కనిపిస్తోంది. గృహాలను ప్రత్యేకంగా అలంకరించుకునేందుకు... ధగధగమెరిసే క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, తోరణాలు శాంతాక్లజ్ బొమ్మలు, ఇతర సామగ్రిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి
Last Updated : Dec 24, 2019, 7:56 PM IST