మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఆ విద్యార్థి ఉపాధ్యాయులకు చెప్పకుండా వెళ్లాడు. అదే ఆ విద్యార్థి చేసిన నేరం.. దాంతో ఆగ్రహించిన వ్యాయామ ఉపాధ్యాయుడు తిరిగి వచ్చిన ఆ విద్యార్థిని విచక్షరహితంగా కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విద్యార్థిని చితకబాదిన వ్యాయామ ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే.! - విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
చెప్పకుండా ఇంటికి వెళ్లడమే ఆ విద్యార్థి చేసిన నేరం.. అందుకు ఆ కర్కశ వ్యాయామ ఉపాధ్యాయుడు బాలుడిని కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. మహబూబాబాద్ జిల్లా దామరవంచలో ఓ గురుకుల పాఠశాలలో ఆలస్యంగా చోటుచేసుకున్న ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి.
teacher beaten gurukul student
ఇప్పుడు ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పాఠశాల ప్రిన్సిపల్ ముత్తయ్యను ఫోన్లో వివరణ అడగ్గా వారం రోజులు కిందట జరిగిన ఈ ఘటన వాస్తమేనని.. మరోసారి ఇలాంటివి పునరావృతం కావద్దని పీఈటీని హెచ్చరించామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: