వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ప్రతి వార్డులో జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించడం ద్వారానే మార్పు సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం 22 మంది అధికారులను సన్మానించారు.
'పట్టణ ప్రగతి పదిరోజుల కార్యక్రమం కాదు'
కేవలం పదిరోజుల్లోనే పట్టణాలు అభివృధ్ది చెందవని పరకాల ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పదిరోజుల కార్యక్రమంగా చూడవద్దని కౌన్సిలర్లను విజ్ఞప్తి చేశారు. పరకాలల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పలువురు అధికారులను సన్మానించారు.
పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమం
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేవలం పది రోజుల కార్యక్రమంగా చూడవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కౌన్సిలర్ల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. నడికుడ మండలంలోని స్థలాన్ని పోలీస్ స్టేషన్‌కు కేటాయించినందుకు పరకాల ఏసీపీ ఎమ్మెల్యే ధర్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: మాస్క్‌లకు పెరిగిన డిమాండ్