తెలంగాణ

telangana

By

Published : Mar 25, 2020, 11:52 AM IST

ETV Bharat / city

ఉమ్మడి వరంగల్​లో 729 మంది ఎన్నారైల నిర్బంధం

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలను గుర్తించి హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు వరంగల్ అధికారులు. అంతా స్వీయ నిర్బంధాన్ని విధిగా పాటించాలని ఆదేశించారు.

NRI's House Arrest In Warangal
వరంగల్​లో 729 మంది ఎన్నారైలు స్వీయ నిర్బంధం

వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారిని ఇంటికే పరిమితం చేసి స్వీయ నిర్బంధంలో ఉండేలా ప్రభుత్వం దృష్టి సారించి వేగం పెంచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే 729 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారిని అధికారికంగా 729 మందిని గుర్తించి అధికారులు స్వీయ నిర్బంధం చేశారు.

క్వారంటైన్ ముద్ర వేసిన వారంతా 14 రోజుల వరకు బయటకు రావొద్దని అధికారులు చెప్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 544 మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 88 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 34 మంది, జనగాం జిల్లాలో 50 మంది, మహబూబాబాద్ జిల్లాలో 10 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరందరినీ గృహ నిర్బంధంలో పెట్టి, వారి మీద ప్రత్యేక యంత్రాంగం నిఘా పెట్టింది.

ఇదీ చూడండి:'పత్రికల నిరంతర సరఫరా దేశానికి అత్యవసరం'

ABOUT THE AUTHOR

...view details