తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘనంగా నిట్​ వరంగల్​ 18వ స్నాతకోత్సవం - వరంగల్​ వార్తలు

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ 18వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. కొవిడ్​ కారణంగా వర్చువల్ విధానం ద్వారా నిర్వహించగా... కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ ప్రోఖ్రియాల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ముఖ్య అతిథులుగా ద్వారా పాల్గొన్నారు.

ఘనంగా నిట్​ వరంగల్​ 18వ స్నాతకోత్సవం
ఘనంగా నిట్​ వరంగల్​ 18వ స్నాతకోత్సవం

By

Published : Oct 23, 2020, 5:24 AM IST

వరంగల్​ నిట్​ 18వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. వర్చువల్​ విధానంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ ప్రోఖ్రియాల్​, ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో నిర్మించిన మూడు భవనాలను ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.

డిగ్రీ పట్టాలు స్వీకరించిన పట్టభద్రులందరికీ కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచం యాంత్రిక మార్గంగా మారిందని... దానికి అనుగుణంగా విద్యార్థి నూతన ఆలోచనలతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల అంకితభావంతో సమర్థవంతంగా పని చేసినప్పుడే... వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేర్కొన్నారు. కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్​లలో నిట్ వరంగల్ 19వ స్థానంలో నిలిచిందని నిట్ డైరెక్టర్ ఎన్.వి రమణ రావు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఈనెల 27 నుంచి వ్యవసాయ డిప్లోమా కౌన్సిలింగ్

ABOUT THE AUTHOR

...view details