తెలంగాణ

telangana

ETV Bharat / city

పోరస్ తారు.. ఈ దారి నీటిని ఇంకించుకునే రహదారి

Porus Tharu Road : వర్షాకాలం వచ్చింది.. రోడ్లన్ని చెరువుల్ని తలపించడం ఖాయం. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే వర్షపు నీరు ఎటువెళ్లాలో తెలియక రోడ్లన్ని స్విమింగ్‌పూల్స్‌లా మారిపోతాయి. వానకాలం ఎప్పుడూ వచ్చినా ఇదే పరిస్థితి. వర్షాకాలంలో రోడ్లపై వాహనదారులు ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి. ద్విచక్రవాహనాలు జారి ప్రమాదాలవుతుంటాయి. దానికో పరిష్కార మార్గం చూపిస్తున్నాడు.. వరంగల్‌ నిట్‌ విద్యార్థి చిరంజీవి. పోరస్‌ తారు ప్రాజెక్టు రూపొందించాడు. ఏంటీ ఈ పోరస్‌ తారు? దాని వల్ల ప్రమాదాల్ని ఎలా తప్పించవచ్చు... ఇప్పుడు చూద్దాం.

Porus Tharu Road
Porus Tharu Road

By

Published : Jun 29, 2022, 2:24 PM IST

పోరస్ తారు.. ఈ దారి నీటిని ఇంకించుకునే రహదారి

Porus Tharu Road : రహదారులు వెంట నీరు పోవడానికి సరైన సదుపాయం లేకపోతే వర్షాకాలంలో ఆ రోడ్లన్ని నీటితో నిండి పోతాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతూ ఉంటారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఐతే పూర్తిగా రోడ్లన్ని కనుచూపు మేరలో భూమిని కప్పేశాయి. ఇలాంటి సమయంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి దారి ఉండదు. రోడ్లన్ని జలమయం అవుతుంటాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నాడు వరంగల్‌ నిట్‌ పరిశోధక విద్యార్థి చిరంజీవి.

Porus asphalt road : వరంగల్ ఎన్‌ఐటీ వినూత్న పరిశోధనలకు నెలవుగా మారింది. ఇక్కడి విద్యార్థులు చేసిన అనేక పరిశోధనలు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా వర్షాకాలంలో నీరు రోడ్లపై నిలవకుండా భూమిలోకి ఇంకిపోయే విధానానికి రూపకల్పన చేశారు. పోరస్ తారుతో చేసిన ఈ రహదారి ప్రాజెక్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Porus asphalt road in telangana : కాంక్రీటు కట్టడాలు పెరుగుతున్న సమయంలో వర్షం పడితే నీరు భూమిలోకి ఇంకిపోవడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గృహసముదాయాలు వరదల్లో మునుగుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో.....ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు...ఈ పోరస్ తారు రహదారులు బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటు దీని ఖర్చు కూడా సాధారణ సీసీ రోడ్ల నిర్మాణంకన్న తక్కువగా ఉంటుందని అంటున్నాడు చిరంజీవి.

Porus asphalt road by NIT student : ఓ విధంగా చెప్పాలంటే పోరస్ రోడ్లు ఇంకుడు గుంతలుగానే పనిచేస్తాయి. భూమి లోపలి పొరల్లోకి నీరు చేరి...క్రమంగా ఇంకుతుంది. దీని కోసం తార్‌ రోడ్డు పైపోరను సరికొత్తగా డిజైన్‌ చేశాడు చిరంజీవి. దీనిలో వాడే మెటిరీయల్‌ కూడా సాధారణ రోడ్డుకు వాడేది ఉపయోగించాడు. కానీ, కంకర పరిమాణం పెంచామని చెబుతున్నాడు. అప్పుడు శూన్య శాతం తగ్గి నీరు తొందరగా భూమిలోకి ఇంకిపోతుందని అంటున్నాడు.

గత రెండు సంవత్సరాల నుంచి ఈ పరిశోధన కోసం చిరంజీవి పని చేస్తున్నాడు. ఈ ప్రయోగం నిట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ పోరస్‌ తారు రోడ్డు రానున్న రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుంది అంటున్నాడు ప్రొఫెసర్‌ శంకర్‌.

వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడం, గుంతలు పడటం, వల్ల రహదారులు పాడైపోతున్నాయి. ఈ రోడ్డు డిజైన్‌ అమలులోకి వస్తే భూగర్భజాలలూ పెరుగుతాయంటున్నాడు చిరంజీవి. ఈ పరిశోధనలు ప్రయోగపూర్వంగా పరిశీలిస్తే.. చక్కని ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే వరంగల్ నగర పాలక సంస్థకు ఈ డిజైన్ అందించనున్నట్లు చెబుతున్నాడు చిరంజీవి.

ABOUT THE AUTHOR

...view details