వరంగల్‌ను ఫ్లడ్ ఫ్రీ సిటీగా మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడిస్తారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా భాజపా మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌ను తలపించే 50 ఏళ్ల బృహత్ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
వరంగల్‌ను ఫ్లడ్ ఫ్రీ సిటీగా మారుస్తాం: కిషన్‌రెడ్డి - kishan reddy speaks on warangal development
వరంగల్‌లో ప్రత్యేక నిధులతో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామని.. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా భాజపా మేనిఫెస్టోను విడుదల చేశారు.

గ్రేటర్ వరంగల్ భాజపా మేనిఫెస్టో విడుదల
రోడ్డు విస్తరణలో స్థలాలు పోయిన వారికి 6 నెలల్లో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వరంగల్‌లో ప్రత్యేక నిధులతో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. చెత్త పన్ను సగానికి తగ్గిస్తామని.. గుంతల రోడ్లకు 15 రోజుల్లో మరమ్మతులు చేపడతామని.. భాజపా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు వెల్లడించారు.
గ్రేటర్ వరంగల్‌లో భాజపా ఎన్నికల మేనిఫెస్టో విడుదల
ఇవీచూడండి:వరంగల్‌కు తెరాస సర్కార్ చేసిందేం లేదు : కిషన్ రెడ్డి
Last Updated : Apr 26, 2021, 5:59 PM IST