వరంగల్ నగరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది . శాసన మండలి ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘన విజయం సాధిస్తారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ మహా నగరం పాలక సంస్థ కార్యాలయంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడియంతో పాటు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎంపీ పసునూరి దయాకర్ ఓటేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన కడియం, పసునూరి దయాకర్ - TG_WGL_18_31_TRS_MLC_POLLING_AV_C3
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన కడియం