తెలంగాణ

telangana

ETV Bharat / city

సమస్యలపై పోరాడే వారికి ఎన్నికల్లో పట్టం కట్టాలి: కోదండరాం - telangana jana samithi president kodandaram latest campaign

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, పబ్లిక్ గార్డెన్​లో తెజస అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం ఎన్నికల ప్రచారం చేపట్టారు. పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాడే వారికి పట్టం కట్టాలన్నారు.

mlc candidate Kodandaram campaigned on upcoming mlc elections
సమస్యలపై పోరాడే వారికి ఎన్నికల్లో పట్టం కట్టాలి: కోదండరాం

By

Published : Oct 10, 2020, 11:06 AM IST

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకొని.. తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, పబ్లిక్ గార్డెన్​లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఉదయం పూట నడకకు వచ్చిన వారితో కోదండరాం మాట్లాడారు.

రాష్ట్రంలో ఎవరిని అడిగినా నిరుద్యోగ సమస్య బాగా ఉందని.. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెతినట్టు వ్యవహరిస్తోందని చెప్పారన్నారు. అందువల్ల పట్టభద్రులంతా సమస్యలపై పోరాడే వారికి పట్టం కట్టాలని ఆయన అన్నారు.

ఇదీ చూడండి:వైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details