అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్ అన్నారు. ఎంసీపీఐ వరంగల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం చతికిల పడిందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఉద్యమకారుడిని.. ఆశీర్వదించండి: చెరుకు సుధాకర్ - వరంగల్ ఎంసీపీఐ కార్యాలయంలో చెరుకు సుధాకర్ మీడియా సమావేశం
తెలంగాణ ఉద్యమకారుడిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని... శాసనమండలి అభ్యర్థి చెరుకు సుధాకర్ కోరారు. ఎంసీపీఐ వరంగల్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యమకారుడిగా తనను గెలిపించాలి: చెరుకు సుధాకర్
కేసీఆర్ నిరంకుశ పాలనపై విసుగు చెందిన నిరుద్యోగులు, ఉద్యోగులు... తెరాసకు చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతారని చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం బినామీలు పోటీ చేస్తున్నారని... ఉద్యమకారుడిగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉన్నందున... తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:నేడు హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన