నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసేందుకు... భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వరంగల్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ముందుగా హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
ఒక్క అవకాశం ఇవ్వండి.. నిరుద్యోగుల పక్షాన పోరాడతా: ప్రేమేందర్ రెడ్డి - telangana latest news
తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. నామినేషన్ వేసేందుకు వరంగల్ నుంచి నల్గొండకు ర్యాలీగా బయలుదేరారు.
![ఒక్క అవకాశం ఇవ్వండి.. నిరుద్యోగుల పక్షాన పోరాడతా: ప్రేమేందర్ రెడ్డి mlc bjp candidate gujjula premendar reddy start from warangal to nalgonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10724114-468-10724114-1613960569985.jpg)
ఒక్క అవకాశం ఇవ్వండి.. నిరుద్యోగుల పక్షాన పోరాడతా: ప్రేమేందర్ రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోందని... తనను గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడతానని ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల పేరుతో ఆరేళ్లుగా తెరాస మోసం చేసిందని విమర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.