'ముంపు బాధితులను అన్ని విధాల ఆదుకుంటాం' - floods in warangal
వరంగల్లో ముంపునకు గురైన కాలనీల్లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పర్యటించారు. బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన ఎమ్మెల్యే... వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తామని హామీ ఇచ్చారు.
వరంగల్లో ముంపునకు గురైన కాలనీలను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సందర్శించారు. గాంధీనగర్తో పాటు పలు కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ముంపు నుంచి తేరుకుంటున్న కాలనీవాసులకు మనోధైర్యం నింపారు. బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన ఎమ్మెల్యే... వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేస్తామని హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సహకారం అందించి ఆదుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.