తెలంగాణ

telangana

ETV Bharat / city

'కలిసి కట్టుగా పనిచేస్తేనే.. అభివృద్ధి సాధ్యం' - parakala mla challa dharmareddy latest updates

వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని స్థంభంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని వివరించారు.

MLA Challa Dharmareddy inspected several development projects in Sthambhapalli village under Warangal Municipal Corporation.
'కలిసి కట్టుగా పనిచేస్తేనే.. అభివృద్ధి సాధ్యం'

By

Published : Jan 20, 2021, 3:21 PM IST

విలీన గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ 4వ డివిజన్ పరిధిలోని స్థంభంపల్లి గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

అభివృద్ధి పనులు ..

స్థంభంపల్లి గ్రామంలో రూ.2 కోట్ల 20లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపిన ఎమ్మెల్యే.. గ్రామంలో రూ.1కోటితో నిర్మితమవుతున్న సీసీ రోడ్ల నిర్మాణం దాదాపు పూర్తైందన్నారు. రూ.50 లక్షలతో మంజూరు అయిన శ్మశానవాటిక పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇటీవల మంజూరైన కమ్యూనిటి భవన నిర్మాణం పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

లిసి కట్టుగా పనిచేసి..

విలీన గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపిన ఎమ్మెల్యే.. మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో అందరూ కలిసి కట్టుగా పనిచేసి అభివృద్ధికి సహకరించాలన్నారు.

ఇదీ చదవండి:మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం

ABOUT THE AUTHOR

...view details