గత పది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని చాలా ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తెలిపారు. హసన్పర్తి మండలం భీమరం చెరువు మత్తడి నీరు పలు కాలనీల్లోకి ప్రవహిస్తుండటంతో వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే రమేష్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
'ఆక్రమణకు గురైన నాలాపై చర్యలు తీసుకోండి' - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలుట
హసన్పర్తి మండలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పర్యటించారు. భీమరం చెరువు మత్తడి నీరు పలు కాలనీల్లో ప్రవహిస్తుండటంతో వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతితో కలిసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.
'ఆక్రమణకు గురైన నాలాపై చర్యలు తీసుకోండి'
నాలా ఆక్రమణకు గురైనందునే చెరువు మత్తడి నీరు కాలనీల్లోకి ప్రవహిస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. ఆక్రమణకు గురైన నాలాపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు నిత్యావసర సరుకులు, సహాయక చర్యలు కొనసాగించాలని సూచించారు.