పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్... కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఆరూరి రమేశ్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు 37.4లక్షల విలువైన చెక్కులను అందించారు.
చెక్కులు, క్రిస్మస్ బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మల్యే - వరంగల్ వార్తలు
పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ... అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. పర్వతగిరి మండంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు.
చెక్కులు, క్రిస్మస్ బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మల్యే
అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బట్టలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి సీఎం అని పేర్కొన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి... దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచారని తెలిపారు.
ఇదీ చూడండి:ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం: హరీశ్