ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలకు పునర్వైభవం వస్తోందని... దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని వివరించారు. వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌తో కలసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నేతలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదాశీర్వచనాలు ఇచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను మంత్రులకు అందించారు.
'సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేవాలయాలకు పునర్వైభవం'
వరంగల్ భద్రకాళి అమ్మవారిని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనాలని ప్రజలకు మంత్రులు విజ్ఞప్తి చేశారు.
అనంతరం... రూ. 3 కోట్లతో వరంగల్ కేంద్ర కారాగారం ఎదుట నిర్మించనున్న దేవాదాయ శాఖ కార్యాలయం, అతిథి గృహ సముదాయానికి భూమిపూజ చేశారు. కరోనా పీడ తొందరగా నివారణవ్వాలని... అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కార్యాలయ నిర్మాణానికి రూ.3 కోట్లు సరిపోని పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వాలని... కార్యాలయ భవనం నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని... మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాఠోడ్ విజ్ఞప్తి చేశారు.