జనగామ జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు వెళ్తుండగా మార్గమధ్యలో గీత కార్మికులను కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రులు తాటి కల్లు సేవించారు.
ఏం టేస్ట్ గురూ... కల్లు తాగిన మంత్రులు - కల్లు తాగిన శ్రీనివాస్ గౌడ్
తాటికల్లు రుచి చూశారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు. వరంగల్ పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యలో గీతకార్మికులతో ముచ్చటించి కల్లు టేస్ట్ చేశారు.
ఏం టేస్ట్ గురూ...కల్లు తాగిన మంత్రులు
శ్రీనివాస్‌గౌడ్ తాగుతున్న సమయంలో మొత్తం తాగితే ఎట్లనయా అంటూ దయాకర్‌రావు సరదాగా అందర్ని నవ్వించారు. ఎర్రబెల్లి ఓ పట్టుపట్టారు. మంత్రులు తమ సంతోషాన్ని గీత కార్మికులతో పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నారన్నారు మంత్రులు తెలిపారు.
ఇవీ చూడండి:మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Last Updated : Jan 29, 2021, 1:08 PM IST