వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పట్టణ ప్రగతి పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు పరిశీలించారు. పచ్ఛదనం పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులకు, ప్రజలకు సూచించారు. పలు వార్డుల్లో తిరుగుతూ పనుల విషయమై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొంత మంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జరిగిన అభివృద్ధిని పరిశీలించారు.
పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
ఈ పది రోజులే కాకుండా నిరంతరం ఇదే విధంగా పనులు జరిగేలా చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతిపై సమీక్షా సమావేశంలో మంత్రి దయాకర్ రావు పాల్గొంటారు.
ఇవీ చూడండి:ఆరు నిమిషాల ఆలస్యం.. మొదటి పరీక్షకు దూరం