మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ వీపీ.గౌతం, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాలు తెలుసుకుని, ప్రభుత్వ భూమిలో ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేయాలనే ఆలోచనతోనే.. అన్ని శాఖల అధికారులతో కలిసి వార్డుల్లో తిరుగుతున్నామన్నారు.
రెండు వందల శాతం జరిమానా: కలెక్టర్ - మహబూబాబాద్ జిల్లా తాజా వార్తలు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థలాలను యజమానులే శుభ్రపరచుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. లేనిపక్షంలో మున్సిపల్ అధికారులు వాటిని శుభ్రం చేసి రెండు వందల శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం
వార్డుల్లో పేరుకుపోయిన మురుగు కాలువలను శుభ్రపరిచి, చెట్ల పొదలను తొలగిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పట్టణంలోని ఖాళీ ప్రదేశాలలో ఉన్న ముళ్ల పొదలు, చెట్లను ఆ స్థల యజమానులు శుభ్రపరచుకోవాలి కోరారు. లేనిపక్షంలో మున్సిపల్ అధికారులు వాటిని శుభ్రం చేసి రెండు వందల శాతం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: అక్రమ లేఅవుట్ల లెక్క తేల్చేందుకు సర్కారు సిద్ధం