తెలంగాణ

telangana

ETV Bharat / city

'దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవసాయరంగ అభివృద్ధికి చర్యలు..' - ఎర్రబెల్లి దయాకర్​రావు

వానాకాలం సాగుపై వరంగల్‌లో నిర్వహించిన సన్నాహక భేటీలో నిరంజన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్‌తో పాటు అధికారులు హాజరయ్యారు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన జరగాలని మంత్రులు ఆకాంక్షించారు.

minister niranjan reddy and errabelli dayakar rao and styavathi ratod in warangal farmers meeting
minister niranjan reddy and errabelli dayakar rao and styavathi ratod in warangal farmers meeting

By

Published : May 17, 2022, 3:25 PM IST

దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవసాయ రంగం అభివృద్ధికి చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వానాకాలం సాగుపై వరంగల్‌లో నిర్వహించిన సన్నాహాక భేటీలో నిరంజన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్‌తో పాటు అధికారులు హాజరయ్యారు. వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన జరగాలన్న నిరంజన్‌ రెడ్డి.. పంట బీమాకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. గోధుమల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించడాన్ని నిరంజన్‌ రెడ్డి తప్పుబట్టారు.

"ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం. వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన జరగాలి. దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవసాయరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. మిషన్‌ కాకతీయ పేరుతో గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేశాం. భవిష్యత్తు తరానికి వనరులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు పెట్టుబడి రాయితీ విధానం ఎక్కడా లేదు. రైతు కేంద్రంగా బీమా అమలు చేస్తోంది రాష్ట్రంలోనే." - నిరంజన్​రెడ్డి, మంత్రి

"రాష్ట్రంలో వ్యవసాయం మూడింతలు పెరిగింది. గతంలో అసెంబ్లీ ముందు రైతులు ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఎక్కడైనా అసెంబ్లీ ముందు రైతులు ధర్నా చేసిన దాఖలాలు ఉన్నాయా..? ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ అందిస్తోంది. రైతులకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందిస్తోంది. రైతులు ఏ పంటలు వేస్తే లాభం చేకూరుతుందో ఆలోచించాలి. పామాయిల్‌ తోటల సాగుతో అధిక లాభాలు వస్తాయి. రైతులు తక్కువ పెట్టుబడి పెట్టి అధిక దిగుబడి సాధించాలి. కోతుల నుంచి పంటలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కోతుల బెడద నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది." - ఎర్రబెల్లి దయాకర్​రావు, మంత్రి

'దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవసాయరంగ అభివృద్ధికి చర్యలు..'

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details