వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ పర్యటించారు. గూడూరు గ్రామంలో గ్రామైక్య మహిళా సంఘాలు, సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు.
తూకాలను జాప్యం చేయకూడదు: మంత్రి ఈటల - minister etela warangal tour
కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో గ్రామైక్య మహిళా సంఘాలు, సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూకోవాలని నిర్వాహకులకు సూచించారు.
తూకాలను జాప్యం చేయకూడదు: మంత్రి ఈటల
కాంటాలను ప్రారంభించి ధాన్యం తుకాలు వేశారు. ధాన్యం నిల్వలను పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మంత్రి మట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. తూకాలను జాప్యం చేయకూడదని సూచించారు. రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:'పంట, ట్రాక్టర్ రుణాలకు చక్రవడ్డీ మాఫీ వర్తించదు'