తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 8:07 PM IST

ETV Bharat / city

ఎన్ని ఆటంకాలొచ్చినా.. ఎవరడ్డొచ్చినా... తగ్గేది లేదు

మామునూర్ విమానాశ్రయం కలగానే మిగిలిపోయిందని... మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు వందల ఎకరాలు తీసుకున్నా కార్యరూపం దాల్చలేదన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎయిర్​పోర్టు పూర్తిచేసి తీరుతామన్నారు.

తెలంగాణ వార్తలు
వరంగల్​ ము్న్సిపల్​ ఎన్నికలు

ఎన్ని ఆటంకాలు ఎదురైనా... ఎవరడ్డొచ్చినా... మామునూర్ ఏయిర్ పోర్ట్ ఆగదని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. ఈ విషయంలో కేంద్రంతో పోరాటానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.

43, 44 వార్డుల పరిధిలో ఉన్న మామునూర్ ఎయిర్​పోర్టును సాధిస్తామన్నారు. అందుకోసం పోరాటానికి సిద్ధం కావాలని మామునూర్ ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పండి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details