'అధిక రుసుం వసూల్ చేసే ఆస్పత్రులపై చర్యలు' - minister errabelli review with task force
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హెచ్చరించారు. ఫీజు నియంత్రణపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీతో సమీక్ష నిర్వహించారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుములు వసూలు చేస్తే.. కఠిన చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెచ్చరించారు. అధిక ఫీజుల నియంత్రణపై టాస్క్‌ఫోర్స్ కమిటీతో మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు స్త్రీనిధి ద్వారా 50 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సట్రేటర్లను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని ధర్మసాగర్, మామ్‌నూర్‌కు తరలించి.. అదే ప్రదేశంలో అత్యాధునిక వసతులతో అధునాతన ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. జ్వరం ఇతరత్రా కరోనా లక్షణాలుంటే.. తక్షణమే మెడికల్ కిట్ ఇవ్వాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి రెండు రోజుల్లో వరంగల్ వచ్చి.. ఎంజీఎంతో పాటు, కేంద్ర కారాగారం సందర్శించే అవకాశాలున్నాయని ఎర్రబెల్లి వెల్లడించారు.
- ఇదీ చదవండి :రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు