వరంగల్ జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నగరంలోని సర్క్యూట్ అతిథి గృహంలో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగడం బాధాకరమన్నారు. వివిధ సంఘాలు ఆందోళనలు, ధర్నాలు చేయడం కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నగర పోలీస్ కమిషనర్ రవీందర్, మేయర్ గుండా ప్రకాష్, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, నిట్ సంచాలకులు ఎన్వీ రమణారావు, ఎమ్మెల్యేలు రాజయ్య, నరేందర్‌లు పాల్గొన్నారు.
వరంగల్ గురించి మాకంటే ముఖ్యమంత్రికే బాగా తెలుసు: మంత్రి ఎర్రబెల్లి - MINISTER ERRABELLI DAYAKAR RAO
వరంగల్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ అతిథి గృహంలో జరిగిన ఎట్‌హోం కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగడం బాధాకరమని.. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.
వరంగల్ గురించి మాకంటే కేసీఆర్‌కే బాగా తెలుసు: మంత్రి ఎర్రబెల్లి