దేశంలోని ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అధ్యక్షతన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, తెరాస కార్పొరేటర్లు హాజరయ్యారు.
'దేశంలో ఎవరూ చేయని అభివృద్ధి కేసీఆర్ చేస్తున్నారు' - hanmakonda latest news
హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అధ్యక్షతన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, తెరాస కార్పొరేటర్లు హాజరయ్యారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే... ఓర్వలేని కాంగ్రెస్, భాజపా నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. తెరాస కార్యకర్తలు గమనించి తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కొంత ఆశ్రద్ధ వల్ల దుబ్బాకలో ఓడిపోయామన్నారు. హైదరాబాద్లో మత రాజకీయాలు చేసి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి గెలిచారని తెలిపారు. ఖాజీపేటకు కేంద్రంగా ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరి ఏమైందని మంత్రి ప్రశ్నించారు. అది ఇవ్వకుండా రైలు డబ్బాలు కడిగే ఫ్యాక్టరి ఇస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.