తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలు.. ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళలపై ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆడపడుచుల గౌరవాన్ని పెంచేందుకే బతుకమ్మ చీరలు : మంత్రి ఎర్రబెల్లి - బతుకమ్మ చీరల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతమైన ఉద్ధేశ్యంతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తున్నదని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ మహిళల గౌరవాన్ని పెంచే కార్యక్రమం అని వ్యాఖ్యానించారు. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఆయన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
కేసీఆర్ ఆడపడుచులకు అందిస్తున్న చీరలకు ప్రత్యేకత ఉందని మంత్రి తెలిపారు. బతుకమ్మ పండుగ నాడు కుటుంబ సభ్యులు ఆడపడుచుకు చీర పెట్టి ఎంత ప్రత్యేకంగా గౌరవిస్తామో.. కేసీఆర్ కూడా బతుకమ్మ చీరలను అంత ప్రత్యేకంగా భావిస్తారన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బహుకరించిన శాలువా తనకు ఎంతో ప్రత్యేకమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామాల్లో మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా బతుకమ్మ చీరలు కట్టుకోవాలని మంత్రి కోరారు.
ఇదీ చదవండి:వైద్యుడిపై వలపు వల వేసి రూ.42 లక్షలకు మోసం!