మినీ పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటర్లను కోరారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా.. హసనపర్తి మండలం పెగడపల్లిలో.. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. వరంగల్ నగర అభివృద్ధికి తెరాసను గెలిపించాలంటూ అభ్యర్థించారు.
ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పండి: ఎర్రబెల్లి - gwmc elections news
గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధీమావ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. హసనపర్తి మండలం పెగడపల్లిలో.. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌తో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
పెగడపల్లిలో మంత్రి ఎర్రబెల్లి ప్రచారం
సామాజిక మాధ్యమాల్లో.. భాజపా ఆరోపణలు చేస్తోందని ఎర్రబెల్లి మండిపడ్డారు. వాటిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. తెరాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇవీచూడండి:గ్రేటర్ వరంగల్ బరిలో రౌడీషీటర్లు