తెలంగాణ

telangana

ETV Bharat / city

'సర్కారు ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు.. ప్రైవేటుకు పోవద్దు' - వరంగల్ ఎంజీఎం

వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరో 250 పడకలు అందుబాటులోకి రావడం బాధితులకు ఊరటనిస్తోంది. మొత్తం 500 పడకలను కరోనా రోగులకే ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. చికిత్స కోసం ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి లక్షలు వృథా చేయవద్దని మంత్రి మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

'ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన సేవలు.. ప్రైవేటుకు పొవద్దు'
'ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన సేవలు.. ప్రైవేటుకు పొవద్దు'

By

Published : Jul 29, 2020, 5:49 AM IST

'సర్కారు ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు.. ప్రైవేటుకు పోవద్దు'

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వరంగల్ పట్టణ జిల్లాలో... వారం రోజుల్లోనే 577 కేసులు నమోదయ్యాయి. వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లాలోనూ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న తరుణంలో...ఎంజీఎం ఆస్పత్రిపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం కొవిడ్ వార్డులో 250 పడకలు ఉండగా.... అందులో అధిక శాతం ఇప్పటికే కరోనా రోగులతో నిండిపోయాయి. జిల్లాలో కరోనా కేసుల పెరుగుదల, నియంత్రణా చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలసి... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా నిర్వహించారు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తుల చికిత్స కోసం... ఎంజీఎంలో ఉన్న 250 పడకలకు అదనంగా మరో 250 పడకలను వారం పది రోజుల్లో అందాబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లొద్దు..

వైరస్‌పై ప్రజల్లో ఇంకా భయాందోళనలు తగ్గట్లేదు. మృతదేహాలను తీసుకువెళ్లేందుకు కూడా కుటుంబసభ్యులు ముందుకు రావట్లేదు. ఇక ఇదే సమయంలో వైరస్ సోకిందన్న అనుమానంతో.. ఇతరత్రా వ్యాధులతో చనిపోయిన వారిని.. ఆసుపత్రుల్లో వదిలేసి వెళ్తున్నారు. ఇలాంటి వారందరి అంత్యక్రియల నిర్వహణ బాధ్యతను వరంగల్ మున్సిపల్ అధికారులు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఎంజీఎంతో పాటుగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కొవిడ్ రోగులకు మెరుగైన సేవలందుతాయని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లవద్దని మంత్రి సూచించారు.


యాప్‌కు రూపకల్పన..

హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఇళ్లలో చికిత్స పొందేవారి ఆరోగ్య సమస్యలు తెలుసుకునేందుకు.. విశ్రాంత వైద్యుల సేవలు ఉపయోగించుకునేలా కొత్త యాప్‌కు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

త్వరలోనే..

ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ హోదాలో డా. వెంకటేశ్వర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమర్ధత, అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని.. త్వరలోనే కొత్త సూపరింటెండెంట్ నియమిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇవీ చూడండి:ఎక్కడో ఒక్కరు చనిపోతే.. దుష్ప్రచారం చేస్తారా? మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details