తెలంగాణ

telangana

'వరంగల్​కు మెట్రో'పై కేటీఆర్​ ఏమన్నారంటే..

By

Published : Jan 7, 2020, 10:54 PM IST

వరంగల్​కు మెట్రో వస్తుందా.. లేక మోనో రైల్​ వస్తుందా అన్న ప్రశ్నకు కేటీఆర్​ సమాధానమిచ్చారు. ప్రజల సౌకర్యార్థం రవాణా వ్యవస్థ ఉండాలన్నదే తమ అభిమతమన్నారు.

ktr
ktr


భవిష్యత్​లో ఐటీ కంపెనీలన్నీ ద్వితీయ శ్రేణి నగరాలకు రానున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్- హైదరాబాద్ మధ్య పరిశ్రమలు రావడం ద్వారా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటవుతుందని తెలిపారు. ఐటీ కంపెనీల ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్​ మాట్లాడారు.

మామ్​నూరు విమానాశ్రయం పునరుద్ధరణ చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపైన జీఎంఆర్ సంస్థతో మాట్లాడుతున్నామన్నారు. త్వరలో ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్​కు మోనో రైలా.. మెట్రో రైల్​ వస్తుందా అన్నది ముఖ్యం కాదని.. ప్రజల సౌకర్యార్థం రవాణా వ్యవస్థ ఉండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు.

'వరంగల్​కు మెట్రో'పై కేటీఆర్​ ఏమన్నారంటే..

ఇవీచూడండి: నిట్​ టు మడికొండ పార్కు... కేటీఆర్​ సెల్ఫ్​ డ్రైవింగ్

ABOUT THE AUTHOR

...view details