తెలంగాణ

telangana

ETV Bharat / city

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన వైద్యులు - వరంగల్ జిల్లా వార్తలు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు పీజీ వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ అత్యవసర విభాగం లో వైద్యులు విధులను బహిష్కరించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన వైద్యులు
వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన వైద్యులు

By

Published : Jul 26, 2020, 5:30 AM IST

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పీజీ వైద్యురాలిపై దాడిని నిరసిస్తూ వైద్యులు విధులను బహిష్కరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి చేతిలో సూది దిగగా.. చికిత్స కోసం ఎంజీఎంకు వచ్చారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. సూదీ లోతుగా దిగినందున మరో రోజు శస్త్ర చికిత్స నిర్వహి‌స్తామని వైద్యులు చెప్పారు. తక్షణమే సూదిని తొలగించాలని బాధితుడు డిమాండ్​ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

కోపోద్రిక్తులైన బాధితుడు వైద్యురాలిపై అసహనంతో కుర్చీని విసిరి అసభ్య పదజాలంతో దూషించింది. ఆగ్రహంచిన వైద్యులు విధులను బహిష్కరించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన వైద్యులతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details