తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్య విద్య కళాశాలల్లో పెరగనున్న సీట్లు

ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ సారి సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. నీట్​లో ర్యాంకులు పొందిన విద్యార్థుల జాబితా వచ్చిన తరువాత... కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామంటోన్నారు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి కరుణాకర్​ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి

వైద్య విద్య కళాశాలల్లో పెరగనున్న సీట్లు

By

Published : Jun 9, 2019, 9:21 AM IST

గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో వెయ్యి సీట్లు పెరుగుతున్నాయని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి కరుణాకర్​ రెడ్డి తెలిపారు. నీట్ ఫలితాలు వచ్చినందున ఇక అఖిల భారత, రాష్ట్ర స్థాయిల్లోనూ కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుందని వీసీ తెలిపారు. ఆలిండియా కోటాకు సంబంధించి మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. అఖిల భారత కోటాలో మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తైన తరువాతే ఇక్కడి విద్యార్థులకు కౌన్సిలింగ్ మొదలవుతుందని స్పష్టం చేశారు. నీట్​లో ర్యాంకులు పొందిన విద్యార్థుల జాబితా వచ్చిన తరువాత... కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికంగా పరిగణిస్తామంటున్న కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి కరుణాకర్​ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఈటీవీ భారత్ ముఖాముఖి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details