తెలంగాణ

telangana

ETV Bharat / city

మేడారం వెతలు: జాతరలో భక్తుల పాట్లు - Medaram jatara latest updates

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. వసతి, తాగునీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.

Medaram jatara
'ఇబ్బందులున్నాయి.. కానీ తల్లులను దర్శించుకుంటే చాలు'

By

Published : Feb 5, 2020, 9:52 AM IST

మేడారం జాతరకు వచ్చే భక్తులకు వసతి సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్నపాటి టెంట్లకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

వసతి కోసం వినియోగించే టెంట్లకు రోజుకు వెయ్యి రూపాయాలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కువ డబ్బులు వెచ్చించి గదులను అద్దెకు తీసుకుంటున్నామని అంటున్నారు.

జాతర పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఎదురుకొంటున్నామని తెలిపారు. తల్లుల దర్శనంతో సంతృప్తి చెందుతామని... ఇలాంటి కష్టాలను లెక్కచేయమని చెబుతున్నారు.

'ఇబ్బందులున్నాయి.. కానీ తల్లులను దర్శించుకుంటే చాలు'

ఇదీ చూడండి:ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ మెట్రోరైలును ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details