నానబెట్టిన ప్యాంటు జేబులో యాభై రూపాయల నోటుంటేనే.. పరుగెత్తుకుంటూ వెళ్లి బకెట్లోంచి ప్యాంటు బయటకు తీస్తాం. పొరపాటున నీళ్లలో నానింది ఐదు వందల రూపాయన నోటు అయితే.. చాలామందికి పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ.. అక్కడ ఏకంగా.. నోట్ల కట్టలే నీళ్లలో నానబెట్టారు. అంతేకాదు.. ఆ నీళ్లలో సర్ఫ్ వేసి ఎంచక్కా ఆ నోట్లను ఉతికి, ఇస్త్రీ చేసి ఆరబెట్టారు. ఏముందీ.. ఆ నోట్లు ప్లాస్టిక్వో, లేదంటే.. వాటర్ ప్రూఫ్ నోట్లు కావొచ్చు అనుకుంటున్నారేమో! అస్సలు కాదు. అవి అచ్చంగా ఒరిజినల్ నోట్లే. పది, ఇరవై, యాభై, వంద, ఐదు వందల రూపాయల నోట్లు. అసలేంటి మ్యాటర్ అని ఆలోచిస్తున్నారా..? ఎక్కువ ఆలోచించకండి. ఆ వివరాలు కూడా మేమే చెప్తాం.
ఈ వీడియో చూడండి. ఎంచక్కా నోట్లు సర్ఫ్ నీళ్లలో నానబెట్టి కడుగుతున్నారో! కడగడం మాత్రమే కాదు.. ముడతలు పోయేలా.. ఇస్త్రీ కూడా చేశారు. మేడారం జాతరలో సమ్మక్క, సారక్కలకు భక్తులు సమర్పించిన కానుకలు, నోట్లు, బియ్యం అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. కనీసం హుండీలు తొలగించే టైమ్ కూడా లేకపోవడంతో హుండీలోని డబ్బులు కూడా తడిసిపోయాయి.