మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల దగ్గర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. తీగలవేణి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఆస్పత్రి నిర్వహణ సరిగ్గా లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణుల సంఖ్య, కాన్పుల వివరాలు, రోగుల సందర్శన పట్టికను పరిశీలించారు. సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పలు ప్రాంతాల్లో కలెక్టర్ గౌతమ్ ఆకస్మిక పర్యటన - Mahabubabad Collector VP Goutham Sudden Inspection
మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకస్మికంగా పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లను పర్యవేక్షించారు.

మహబూబాబాద్ జిల్లాలో కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకస్మిక పర్యటన