Kaleshwaram News: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షం ధాటికి అనూహ్య రీతిలో చేపలు కొట్టుకొచ్చాయి. సోమవారం కాళేశ్వరంలోని పడిదం చెరువు సమీపంలో, అటవీ ప్రాంతంలో ఈ చేపలు రోడ్లపై రైతులకు కనిపించాయి. వారంతా చేపల వర్షం కురిసిందని చెబుతున్నారు. అధిక బరువున్న చేపలను కొందరు పట్టుకొని నిల్వ చేశారు.
కాళేశ్వరం అటవీ ప్రాంతంలో చేపల వర్షం.. ఆశ్చర్యానికి గురైన స్థానికులు.. - జయశంకర్ భూపాలపల్లి తాజా వార్తలు
Kaleshwaram News: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొన్ని చోట్ల చేపలు నేలపైకి వచ్చాయి. సోమవారం అటు వెళ్లిన స్థానికులకు అటవీ ప్రాంతంలో చేపలు ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు చేపలు పట్టుకుని హర్షం వ్యక్తం చేశారు. చేపలు కొట్టుకురావడం ఇంతకుముందెన్నడూ జరగలేదన్నారు.
Live fish in the Kaleswaram forest area
ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ మాట్లాడుతూ.. సముద్ర తీర ప్రాంతాల్లో సుడిగాలి వచ్చిన సమయంలో నీటితో పాటు చేపలు పైకి లేచి మేఘంగా మారి వర్షంతో పాటు పడతాయని చెప్పారు. కాళేశ్వరంలో చేపల వర్షం కురిసిందని చెప్పలేమన్నారు. ఈ చేపలను వాడుక భాషలో నటు గురక అని, శాస్త్రీయ నామం అనాబస్ టెస్ట్‌ట్యూడియస్ అంటారని, ఇవి చిన్నపాటి నీళ్ల ధార ఉన్నా పాకుకుంటూ నేలపైకి వస్తాయని చెప్పారు.
ఇవీ చదవండి: