మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వామపక్షలు ఆందోళనకు దిగాయి. ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో వరంగల్ పట్టణంలోని చందకాంతయ్య కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. మహిళలపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, దాడులను అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వామపక్ష నేతలు ఆరోపించారు. మహిళలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'మహిళలపై దాడుల్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలం' - left parties news
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వరంగల్ పట్టణంలో ఎంసీపీఐ(యూ) నేతలు ధర్నా నిర్వహించారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కేసులు నమోదు కానందునే తరచుగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయని వామపక్ష నేతలు అభిప్రాయపడ్డారు.
వరంగల్ పట్టణంలో ఎంసీపీఐ(యూ) నేతలు ధర్నా
నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కేసులు నమోదు కానందునే అత్యాచారాలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.