వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
హన్మకొండలో ప్రణబ్, వైఎస్సార్‌లకు నివాళి - హన్మకొండలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
హన్మకొండలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షునితోపాటు కార్యకర్తలు వైఎస్సార్, ప్రణబ్ ముఖర్జీకి నివాళులు సమర్పించారు.
హన్మకొండలో వైఎస్సార్, ప్రణబ్‌కు నేతల నివాళులు
జిల్లా అధ్యక్షునితోపాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్‌తోపాటు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులు అర్పించారు. వారి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని, వారి ఆశయాలను కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు.
ఇదీ చూడండి :తొలిరోజు ఆన్ లైన్ తరగతులకు 48 వేల మంది విద్యార్థులు
TAGGED:
Leaders pay tribute to YSR