వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉల్లిగడ్డ, దామర, కడిపికొండ గ్రామాలకు చెందిన కుమ్మరి వంశస్థులు మొదటగా డప్పు చప్పుళ్లతో, నృత్యాలు చేస్తూ వీరబోనం పోసి ఎడ్లబండ్ల రథాలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
ఘనంగా వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు - ఘనంగా వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
భీమదేవరపల్లిలో వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కుమ్మరి వంశస్థులు మొదటగా వీరబోనం పోసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకోనున్నారు.

ఘనంగా వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
స్వామివారికి ప్రీతిపాత్రమైన గుమ్మడి కాయలను గ్రామస్థులు పెద్ద ఎత్తున తీసుకువచ్చి సమర్పించారు. నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకోనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:తిరుమల శ్రీవారు... వేటకు వచ్చారు!