కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళనలు చేపడితే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. రైతు చట్టాలపై ప్రభుత్వం తమ వైఖరిని ప్రకటించాలని కోరారు. చట్టాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తోందా.. వ్యతిరేకిస్తోందా.. స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఆ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలి' - కోదండరాం తాజా విలేకరుల సమావేశం
నూతన వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని ప్రకటించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం కోరారు. చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందని విమర్శించారు.
'ఆ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలి'
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నిరసనకు తమ మద్దతు ఉంటుందని కోదండరాం అన్నారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఇల్లందును మోడల్ సిటీగా మార్చేందుకు సహకరిస్తాం: కేటీఆర్