పాలకులను ఎన్నుకునే గొప్ప అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. చట్ట సభలకు ఎవరిని పంపాలో నిర్ణయించే అధికారం ప్రజలకే ఉంది. రాజకీయ నేతల తలరాతలు మార్చే వజ్రాయుధం ఓటు. అభ్యర్థుల భవిష్యత్తు ఓటర్ మహాశయుల కరుణా కటాక్షాలపైనే ఆధారపడి ఉంది. అంతటి ప్రాధాన్యమున్న ఓటు విలువను ఇప్పటికీ చాలామంది గుర్తించట్లేదు. పోలింగ్ రోజును సెలవు దినంగా పరిగణించేవారూ ఉన్నారు. విద్యావంతులు, ఉద్యోగులు, అక్షరాస్యులు ఎక్కువగా నివాసం ఉండే పట్టణాల్లో ఈ జాడ్యం పెరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 90శాతానికి పైగా పోలింగ్ నమోదవుతున్నా... నగరాల్లో 60శాతానికి మించడమే గగనమవుతోంది. సెలవు వచ్చిందని కొంతమంది ఊళ్లకు చెక్కేస్తే... సొంత పనులు చూసుకొని తీరిగ్గా పోలింగ్ ముగిసే సమయానికి వచ్చేవాళ్లూ ఉన్నారు. ఇలా కాకుండా సాధ్యమైనంత త్వరగా కేంద్రాలకు వెళ్లి ఓటేయాలని పిలుపునిస్తున్నారు ఓరుగల్లు కవులు.
ఓటును అమ్ముకోవడం నేరం, సమాజానికి విఘాతం - 2019 elections
ఎన్నికల్లో ఓటేయడం మన కర్తవ్యం. పనులన్నీ పక్కన పెట్టి పోలింగ్ రోజున ఓటేయాల్సిందే. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సద్వినియోగం చేసుకోవాలని... తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచే ఓరుగల్లు రచయితలు, కవులు, మేధావులు ఓటేద్దాం అంటూ ముక్తకంఠంతో పిలుపునిస్తున్నారు.
కవుల నోట ఓటు మాట
ప్రజాస్వామ్యంలో స్వచ్ఛమైన ఓటుహక్కును ప్రలోభాలకు లొంగి అమ్ముకుంటున్నారు చాలామంది. మందు, డబ్బు, మాంసం, చీరలు, క్రికెట్ కిట్లు వంటి తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడితే... మన వినాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్నట్లు అవుతుందంటున్నారు. రచనలతో సమాజాన్ని జాగృత పరిచే రచయితలు, కవులు చెబుతున్న మాటలు శ్రద్ధతో ఆలకించి ఓటింగ్ శాతాన్ని పెంచుదాం... సరైన నాయకులను ఎన్నుకుందాం.
ఇవీ చూడండి: నూలునిచ్చిన మిల్లే... నేతలనిచ్చింది
Last Updated : Apr 10, 2019, 10:19 PM IST