యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మాప్ అప్ విడత వెబ్ కౌన్సిలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎ్‌స), ఆయుర్వేద (బీఏఎంఎస్), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ), యునాని (బీయూఎంఎస్) కోర్సుల్లో ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ - kaloji health university latest news
వైద్యవిద్యలో వివిధ కోర్సుల్లోని యూజీ ఆయుష్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 6, 7 తేదీల్లో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
![కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ kaloji varsity notification for replacement of UG AYUSH convener quota seats](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10890726-379-10890726-1614996677126.jpg)
ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలిండియా కోటాలో యూజీ ఆయూష్ కోర్సులలో సీటు పొందిన అభ్యర్థులు, కాళోజీ, ఎన్టీఆర్ యూనివర్సిటీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీటు పొందిన అభ్యర్థులతో పాటు మొదటి, రెండవ విడతలలో సీటు పొంది చేరని అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సిలింగ్‌కు అనర్హులని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి:మూగ జీవాలకు తప్పని నీటి తిప్పలు