రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో రెండో విడత ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం, బుధవారం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెడికల్, డెంటల్ కళాశాలకు కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీచేయనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు.