తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆటో వద్దకొచ్చి రిజిస్ట్రేషన్‌.. ఆదర్శంగా నిలుస్తున్న అధికారులు

వరంగల్ గ్రామీణ జిల్లా దామెర మండల జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రియాజుద్దీన్‌, డేటా ఆపరేటర్‌ సాగరిక ఔదార్యాన్ని చాటుకున్నారు. భూమి విక్రయానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓ వృద్ధుడి వద్దకు వచ్చి.. ప్రక్రియను పూర్తి చేశారు.

By

Published : Mar 27, 2021, 7:05 AM IST

lands registration process, joint sub registrar
land registration in auto, registration process

నడవలేని స్థితిలో ఉన్న దామెర మండలంలోని పులుకుర్తికి చెందిన రైతు సర్వు పోషిరెడ్డి... తనకు సంబంధించిన 397/2 సర్వే నంబరులోని 30 గుంటలు, 396/5 నంబరులోని 1 ఎకరం 23 గుంటల వ్యవసాయ భూమిని అమ్మేందుకు స్లాట్‌ను నమోదు చేసుకున్నాడు. జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి శుక్రవారం ఆటోలో వచ్చాడు.

విషయం తెలుసుకున్న జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రియాజుద్దీన్‌, డేటా ఆపరేటర్‌ సాగరిక ఆటో వద్దకు వచ్చి పోషిరెడ్డికి సంబంధించిన భూమి పత్రాలను పరిశీలించారు. అతని వేలిముద్రలను తీసుకుని రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు.

ఇవీ చూడండి:పలుచోట్ల దయనీయంగా యాసంగి పంటల పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details