తెలంగాణ

telangana

ETV Bharat / city

'పనులు పక్కన పెట్టి పార్టీ చేసుకున్న అధికారులు' - ఇరిగేషన్​ అధికారుల పార్టీ

వరంగల్ జిల్లా ఈ పేరు చెబితే వరద దృశ్యాలే మన కళ్లముందుంటాయి. నీటి ఉద్ధృతికి అనేక ప్రాంతాల్లో చెరువులకు కట్టలు తెగి పంటలు నీట మునిగాయి. ఉద్ధృతి తగ్గాక చెరువులకు మరమ్మత్తులు చేపట్టాల్సిన అధికారులు విధులను విస్మరించారు. పనులు పక్కన పెట్టి మద్యం మత్తులో మునిగి తేలారు.

'పనులు పక్కన పెట్టి పార్టీ చేసుకున్న ఇరిగేషన్​ అధికారులు'
'పనులు పక్కన పెట్టి పార్టీ చేసుకున్న ఇరిగేషన్​ అధికారులు'

By

Published : Aug 25, 2020, 10:34 PM IST

Updated : Aug 25, 2020, 11:02 PM IST

నీటిపారుదల శాఖ అధికారులు పనులు పక్కనపెట్టి మద్యం సేవించిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట కోనారెడ్డి చెరువు కట్ట వద్ద రెండు రోజులుగా జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి వచ్చిన జిల్లా అధికారులు.. గుత్తేదారుడితో కలిసి మద్యం సేవించే దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

'పనులు పక్కన పెట్టి పార్టీ చేసుకున్న అధికారులు'

ఐదురోజుల క్రితం జిల్లాలో కురిసిన వర్షాలకు చెరువు కట్ట 80మీటర్లు గండిపడి తెగిపోయింది. సుమారు వందల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. తాత్కాలికంగా మట్టి, ఇసుక బస్తాలతో రింగ్ బండ్ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు జరిగే చోటే మద్యం సేవించి విందు చేసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:సచివాలయంలో అగ్నిప్రమాదం- రాజకీయ దుమారం

Last Updated : Aug 25, 2020, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details