సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. ఏకధాటిగా వర్షం కురవగా.. హన్మకొండ బస్టాండు, కాకాజీకాలనీ, ఏషియన్‌మాల్ రోడ్లు నీటితో నిండిపోయాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండ బస్టాండు వద్ద వరద తాకిడికి పలు వాహనాలు వరదలో ఇరుక్కుపోయాయి. ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ నగరంలో భారీ వర్షం.. రోడ్లు జలమయం - వరంగల్ నగరంలో భారీ వర్షం
వరంగల్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. హన్మకొండ బస్టాండు వద్ద వరద తాకిడికి పలు వాహనాలు వరదలో ఇరుక్కుపోయాయి. పలువురు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
వరంగల్ నగరంలో భారీ వర్షం.. రోడ్లు జలమయం